వైయస్ జగన్ యాత్రతో శ్రీకాకుళం ఎమ్మెల్యేల్లో గుబులు

Congress
శ్రీకాకుళం: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెసు శాసనసభ్యుల్లో గుబులు రేపుతోంది. దీంతో ఆయన ఓదార్పు యాత్రలో పొల్గొనే విషయంపై వారు పునరాలోచనలో పడ్డారు. జగన్ కు వీరవిధేయుడిగా చెప్పుకునే కొండ్రు మురళి కూడా హైదరాబాదుకు చెక్కేశారు. జగన్ తీరుపై పార్టీ అధిష్టానం తీవ్రంగా మండిపడుతున్న సంకేతాలు అందడంతో వారు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు జగన్ యాత్రకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, మంత్రులు, శాసనసభ్యుల వారసులు జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. కావాలనే వారిని పంపించినట్లు అధిష్టానం భావిస్తే సమాధానం చెప్పుకోవడం ఎలా ఆందోళన వారికి పట్టుకుంది.

జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. అధిష్ఠానం అనుమతినివ్వకుంటే తాము దూరంగా ఉన్నా తమ కుటుంబ సభ్యులతో యాత్రను నడిపించాలని కొందరు పెద్ద నేతలు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి ధర్మాన కుమారుడు రామ్మనోహర నాయుడు పేరుతో జగన్‌ యాత్రను స్వాగతిస్తూ కటౌట్లు నెలకొల్పారు. పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి దూరంగా ఉండగా, ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ యాత్రలో పాల్గొనడానికి కొంత మంది శాసనసభ్యులు సోమవారం సాయంత్రం వరకు ఉత్సాహం ప్రదర్శించారు. అయితే, అధిష్టానం మంగళవారం జగన్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడంతో వారిప్పుడు వెనక్కి తగ్గుతున్నారు.

సోనియా గాంధీ తన యాత్ర పట్ల సముఖత చూపలేదని వ్యక్తం చేయలేదని జగన్ తన బహిరంగ లేఖలో రాసిన వ్యాఖ్య ఇప్పుడు ప్రధానంగా చిచ్చు రేపుతోంది. నేరుగా సోనియాను ఢీకొనడానికి జగన్ సిద్ధపడినట్లు అది సంకేతాన్ని ఇస్తోంది. జగన్‌ ప్రకటనలో ఆ వాక్యం లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని పార్టీ నేతలంటున్నారు. తనతో జరిగిన సంభాషణను ప్రజలకు బహిరంగ లేఖ రూపంలో జగన్‌ వివరించడం, అందులో తాను సుముఖత చూపకున్నా యాత్ర చేస్తాననే వైఖరిని చాటి చెప్పడం సోనియాకు ఆగ్రహం తెప్పించాయి. అధిష్ఠానం జగన్‌ తీరు పట్ల మరింత రగిలిపోతుందనే సంకేతాలు మంగళవారం వెలువడ్డాయి. అప్పటి నుంచి ఎమ్మెల్యేలంతా యాత్రకు వీలయినంత దూరంగా ఉండడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మొదటి నుంచి ఎవరొచ్చినా రాకున్న విప్‌ కొండ్రు మురళీమోహన్‌ జగన్‌ వెంట ఉంటారని భావించారు. ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. విప్‌గా ఉండి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడం సరికాదనేది ఆయన అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+