మావోయిస్టుల డంప్ లో 4 కోట్ల బంగారం లభ్యం?

Warangal Map
వరంగల్: వరంగల్ జిల్లాలో మావోయిస్టులకు చెందిన నాలుగు కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు దొరికాయన్న విషయం సంచలనం సృష్టించింది. పినపాక మండలంలోని సమత్‌మోతె పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గిరిజన రైతుకు మావోయిస్టులకు చెందిన డంప్‌లో భారీస్థాయిలో బంగారం బిస్కెట్లు లభించిన విషయం సంచలనం రేపింది. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి సమీపంలోని దైతగుట్టల వద్ద దట్టమైన అడవిలో ఈ డంప్‌ దొరికిందని ప్రచారం జరుగుతోంది. సంబంధిత వ్యక్తి బంగారం బిస్కెట్‌ తూకం తెలుసుకోవడం కోసం గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద కాంటా వేయించడంతో ఈ విషయం బయటకు పొక్కినట్లుగా సమీప గ్రామాల ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

ఈ డంప్‌లో ఓ స్టీల్‌ పెట్టెలో భద్రపరిచిన 30 బంగారం బిస్కెట్లు దొరికాయంటున్నారు. వీటి విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. వీటితో పాటు డంప్‌ వివరాలతో కూడిన ఓ పుస్తకం కూడా లభించినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై కరకగూడెం ఎస్సై రమేశ్‌ను వివరణ కోరగా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని డంప్‌ సమాచారం తమ దృష్టికి రాలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+