ఎపి, మహారాష్ట్ర సరిహద్దులో చంద్రబాబు సహా టిడిపి నేతల ధర్నా

బాబ్లీ విషయంలో తమకు ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే తప్ప తాము కదిలేది లేదని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశపరిచి సమస్యను పరిష్కరిస్తామని ప్రధాని నుంచి హామీ రావాలని ఆయన అన్నారు. నిపుణుల కమిటీ వేయించి బాబ్లీ, ఇతర అక్రమ ప్రాజెక్టుల వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబ్లీని అడ్డుకోకపోతే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని చంద్రబాబు అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని, ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications