చంద్రబాబు నాయుడు బాబ్లీ పోరు: రాష్ట్రంలో ప్రాణత్యాగాల పర్వం

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా మైలవరంలో టిడిపి కార్యకర్త దునకా జమలయ్య(42) ఆదివారం ఉదయం మృతి చెందాడు. చంద్రబాబును అరెస్టు చేసిన వార్త విని గుంటూరు జిల్లా కురగల్లులో టిడిపి కార్యకర్త కుర్రా శ్రీనివాసరావు(44) ఆదివారం మరణించాడు. పార్టీ కార్యకర్తల ఆత్మహత్యలపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం, బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తెదేపా అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు. శాంతియుతంగా ఆందోళన తెలపాలని, ఎటువంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడవద్దని శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications