బాబ్లీపై నిరసన: తెలుగుదేశం పార్టీ బంద్ తో స్తంభన

ఒంగోలు-కర్నూలు రహదారిపై తెదేపా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో తెదేపా రాస్తారోకో చేపట్టింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై తెదేపా, సీపీఎం రాస్తారోకో చేపట్టాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్‌లోని పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కరీంనగర్, హన్మకొండ డిపోల్లో బస్సులు కదలకుండా తెదేపా నేతలు బైఠాయించారు. కడపలో వాహనాల టైర్లలో గాలి తీసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. మంగళగిరిలో బస్సులను అడ్డుకున్న తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ కారణంగా ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దులోని బిద్రెల్లి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్ డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. ఇదిలాఉండగా ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications