వైయస్ జగన్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లే

జగన్ యాత్రకు ప్రాధాన్యం తగ్గించాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉంది. యాత్రను చూపించి జగన్ పై చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. జగనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా క్రమంగా పరిస్థితులను నెడుతోంది. అంబటి రాంబాబుపై చర్య ఇందులో భాగమే. ఈ చర్యతో జగన్ వర్గంలో తీవ్ర నిరాశ నెలకొంది. అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోననే భయం నెలకొంది. పార్టీలో ఉంటూనే ఓదార్పు యాత్రను కొనసాగించాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ నిర్ణయించుకున్న ప్రకారం ఓదార్పు యాత్ర పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలలు పడుతుంది. ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు. శ్రీకృష్ణ కమిటీ నిర్ణయం తర్వాత రాష్ట్ర పరిస్థితి మారే విషయంపై కూడా జగన్ నిర్ణయం ఆధార పడి ఉండవచ్చు. మొత్తం మీద, జగన్ తీవ్రమైన ఒత్తిడిలో పడ్డారనేది మాత్రం నిజం.












Click it and Unblock the Notifications