మహారాష్ట్ర నుంచి తిరిగి వస్తామనుకోలేదు: చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి తాము తిరిగి వస్తామనుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర పోలీసులు తమపై చేసిన దౌర్జన్యం తాము తిరిగి వస్తామనే నమ్మకాన్ని కలిగించలేదని ఆయన అన్నారు. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించారని ఆయన అన్నారు. బాబ్లీని చూపిస్తామని మోసం చేసి తమను అరెస్టు చేశారని ఆయన చెప్పారు. తమను పెట్టిన ఐటిఐ ఆవరణలో కనీస వసతులు కూడా లేవని ఆయన అన్నారు. తమను రాజకీయ ఖైదీల కన్నా హీనంగా చూశారని ఆయన అన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం తను ప్రజాప్రతినిధులుగా చూడలేని, రాజకీయ ఖైదీలుగా చూస్తోందని ఆయన విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లడానికి వీసాలు, పాస్ పోర్టులు కావాలా అని ఆయన అడిగారు. దేశంలోని ఎక్కడైనా తిరిగే హక్కు తమకు ఉందని మెజిస్ట్రేట్ కు చెప్పామని ఆయన చెప్పారు. తమపై పెట్టిన కేసులు చెల్లవని, బెయిల్ తీసుకునే ప్రసక్తి లేదని చెప్పామని ఆయన అన్నారు. గత ఐదేళ్లుగా తాము బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎడారి అవుతుందని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బాబ్లీని కట్టడానికి మహారాష్ట్ర సాహసం చేయలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+