నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దుకాణం మూతపడుతుందా? అవునని చెప్పుకుంటున్నారు డి. శ్రీనివాస్. ఉప ఎన్నికల్లో తాను గెలిస్తే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ దుకాణం మూతపడుతుందని ఆయన బుధవారం ఎన్నికల ప్రచారంలో అన్నారు.
తన దుకాణం మూతపడుతుదనే కెసిఆర్ తనను టార్గెట్ చేసుకున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ పప్పులు ఉడకవని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేస్తే అది త్యాగం ఎలా అవుతుందని ఆయన అడిగారు.