బాబ్లీపై ఆనాడెందుకు మాట్లాడలేదు: బాబుకు రోశయ్య ప్రశ్న

Rosaiah
హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టుపై ఆనాడెందుకు మాట్లాడలేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బాబ్లీ నిర్మాణం ప్రారంభమైందని, ఆనాడు చంద్రబాబు మౌనంగా ఉన్నారని ఆయన బుధవారం అన్నారు. బాబ్లీని ఆపేందుకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని, అయితే ఈ ప్రయత్నం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రాకుంటే చంద్రబాబు ఈ యాత్ర చేసి ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 25వ తేదీ వరకు చంద్రబాబు అక్కడే ఉందామని అనుకున్నారు గానీ కుదరలేదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగు, మరాఠీ ప్రజలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం చెలరేగే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించేందుకు తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. 2006 నుంచి కూడా తాము ఆ పనిలో ఉన్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్ర వైఖరిని తప్పు పట్టిందని ఆయన అన్నారు. తాము మహరాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తే తెలుగుదేశం పార్టీ తమను ఖండిస్తోందని ఆయన అన్నారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోగలమని తాను నమ్ముతానని, ఇతరులు కూడా దాన్ని నమ్మాలని అనుకుంటానని, దేశాల మధ్య సమస్యలను కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని ఆయన అన్నారు. బలప్రదర్శన ద్వారా సమస్యను పరిష్కరించుకోలేమని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా, కోర్టు ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేగలమని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో హైదరాబాదులోని బషీర్ బాగ్ లో, ఇతర ప్రాంతాల్లో జరిగిన కాల్పులు, పోలీసు ప్రయోగం సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం యాత్ర మానుకుంటుందని అనుకున్నానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+