మోహన్ బాబుతో చిరంజీవికి విభేదాలు లేవట

Chiranjeevi
తిరుపతి: సినీనటుడు మంచు మోహన్‌ బాబుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ప్రజారాజ్యం పార్టీ అధినేత డాక్టర్‌ చిరంజీవి స్పష్టం చేశారు. రెండు రోజుల తిరుపతి పర్యటన సందర్భంగా ఆదివారం చిరంజీవి ఎం.ఆర్‌.పల్లి, సత్యనారాయణపురం, జీవకోనలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 24న రాత్రి చిరంజీవి మోహన్‌బాబు ఆహ్వానంపై ఎ.రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్‌కు వెళ్ళి మోహన్‌బాబు ఆతిథ్యాన్ని స్వీకరించారు. గతంలో వీరిమధ్య తీవ్ర విభేదాలు ఉండడంతో శనివారం నాటి సంఘటనను దృష్టిలో వుంచుకుని విలేఖరులు ప్రశ్నించగా చిరంజీవి పై విధంగా స్పందించారు.

చలనచిత్ర వజ్రోత్సవాల సందర్భంగా తమ మధ్య విభేదాలు పొడచూపిన మాట వాస్తవమేనని, అయితే తదనంతరం అవి సమసిపోయాయని చెప్పారు. ప్రస్తుతం తమ కుటుంబాలు రాకపోకలు సవ్యంగానే సాగిస్తున్నాయని, విభేదాలకు ఆస్కారంలేదని అంటూ తాను విద్యానికేతన్‌కు వెళ్ళడాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. ఈ నెల 26న అఖిలపక్షం ప్రధానమంత్రిని కలిసేందుకు వెళుతుందని, బాబ్లీ విషయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా జిల్లాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉపేక్షించబోమని, రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బాబ్లీ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత వుందని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+