రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే

పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రధానిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన రోశయ్యను మీడియా ప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడారా అని అడిగితే ఆ విషయం మాట్లాడడానికి తానేమీ తెలివితక్కువ వాడిని కానని సమాధానమిచ్చారు. ప్రధానితో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడినట్లు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని, ఆ సమయంలో ప్రధానితో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడటానికి నేనేమి తెలివితక్కువవాన్ని కాదని అన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్లు చెప్పారు.
అంతకు ముందు రోశయ్య కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్పమొయిలీని పార్లమెంటు సెంట్రల్ హాలులో కలుసుకున్నారు. ఇరువురి మధ్య రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, తదితరవాటిపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. రోశయ్య కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండేతో, గులాం నబీ ఆజాద్ తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications