తెలంగాణ ముసుగులో టిడిపిపై కుట్ర జరుగుతోంది: ఎర్రబెల్లి

అధికార పార్టీని వదిలేసి తెలంగాణ కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజల విజయమని ఆయన అన్నారు.
ఇషాన్ రెడ్డి లేఖలో తెలంగాణ ద్రోహిగా తన పేరు ఉండడంపై తెలుగుదేశం మరో నాయకుడు కడియం శ్రీహరి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిత్తశుద్ధితో తెలంగాణకోసం పని చేస్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వాదించిన నాయకుల్లో తాను ఒక్కడినని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications