శోభారాణి వ్యాఖ్యలపై చిరంజీవి డోంట్ కేర్

Chiranjeevi
హైదరాబాద్: తమ పార్టీపై తమ మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి చేసిన వ్యాఖ్యలపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తప్పుదోవ పట్టించడానికి పార్టీ పసిబిడ్డలు ఎవరూ లేరని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సినీ నటి రోజారమణి వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. పార్టీని, నాయకులను ప్రజలే గైడ్ చేస్తారని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే పార్టీ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర నిర్ణయం సమిష్టిగా తీసుకున్నామని, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు.

బాబ్లీ సమస్యపై ప్రధాని అధ్యక్షతన జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తమను నిరాశపరిచిందని చిరంజీవి అన్నారు. బాబ్లీ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశించామని కానీ తమ ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆ తీర్పును గౌరవించాలనటం ఏం సబబని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పాఠశాలలు, వైద్యశాలలు లేకుండా బార్లు ఏర్పాటుచేయటం సరికాదన్నారు. ప్రభుత్వం మద్యాన్ని పోషిస్తున్న తీరును ప్రజాచైతన్య యాత్రల్లో ఎండగడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+