హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో కొత్త వాహనాలు ఏర్పాటయ్యాయి. ఆయన కాన్వాయ్ లో ప్రస్తుతం ఉన్న అంబాసిడర్లకు బదులు టాటా సఫారీ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలిపిరి ఘటన తరువాత తనకు కొత్త కార్లు కావాలని ఎన్ని సార్లు అడిగినా ప్రభుత్వం స్పందించక పోవటంతో బాబు తనే రెండు టాటా సఫారీలను కొని బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారు. ఇప్పుడు అలాంటివే 8 ప్రభుత్వంకొని అందులో రెండు బుల్లెట్ ప్రూఫ్ చేయించింది.