వైయస్ తోనే తిరుమల పవిత్రతకు భంగం: చంద్రబాబు

టిటిడి వివాదాలకు నిలయంగా మారిందని, డబ్బులున్న వారికే వెంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతోందని, మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న పేదవాళ్లకు దర్శనం దుర్లభం అవుతోందని దుయ్యబట్టారు. అవినీతికి నిరసనగా ఎన్ని సార్లు ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ఈ పాలకమండలికి చీమకుట్టినట్త్లెనా లేదని అన్నారు. దేవునికి సేవలు చేయాల్సిన టిటిడి బోర్డు వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు. టిటిడి నీచమైన కార్యానికి ఒడిగట్టిందని ఆయన విమర్శించారు. అన్యాయాలకు, అరాచకాలకు నిలయంగా మారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications