చంద్రబాబుకే పిచ్చి, మా తడాఖా చూపిస్తాం: కెసిఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ దేశద్రోహమని సీమాంధ్ర మంత్రులు శ్రీకృష్ణ కమిటీ ముందు వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు మంత్రులై ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా వారు ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. ఆ రకంగా వారు రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. వారికి లజ్జ, సిగ్గు, నిబద్ధత ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణపై సీమాంధ్ర మంత్రులది దురహంకార వైఖరి అని ఆయన వ్యాఖ్యానించారు. వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే గవర్నర్ వారిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications