సత్య సాయిబాబాను నేడు దర్శించుకోనున్న రోశయ్య

Rosaiah
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయుల పంచశతాబ్ది ముగింపు ఉత్సవాలకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పెనుకొండ పర్యటన ఖరారైంది. ఈ మేరకు కలెక్టరేట్‌కు ఫ్యాక్సు అందింది. పర్యటన స్వల్పంగా మార్పు చేశారు. తొలుత పుట్టపర్తికి చేరుకుని, సత్యసాయిబాబాను దర్శించుకుని పెనుకొండకు హెలీక్యాప్టర్‌లో చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా...

* ఉదయం 11.30 గంటలకు ప్రకాశం జిల్లా చీరాల నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 1.10 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు.
* పుట్టపర్తిలోనే అధికారులు, అనధికారులతో కాసేపు సమావేశమవుతారు.
* మధ్యాహ్నం 1.25 గంటలకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం సత్యసాయిబాబాను దర్శించుకుంటారు.
* సాయంత్రం 4.30 గంటలకు పుట్టపర్తి నుంచి హెలీక్యాప్టర్‌ లో బయలుదేరుతారు.
* సాయంత్రం 4.50 గంటలకు పెనుకొండ చేరుకుంటారు.
* పెనుకొండలో అధికారులు, అనధికారులతో కాసేపు సమావేశమవుతారు.
* సాయంత్రం 5.00 నుంచి 6.30 గంటల వరకు శ్రీకృష్ణదేవరాయల ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు.
* సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.45 గంటల వరకు పెనుకొండ ప్రభుత్వ అథితి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
* రాత్రి 8.58 గంటలకు పెనుకొండలో రైలులో బయలుదేరుతారు.
* సోమవారం(9న) ఉదయం 5.40 గంటలకు హైదరాబాదుకు చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+