హైదరాబాద్: సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా పలు ప్రాంతాల్లో తెరాస నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాటారం, మహాదేవ్ పూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన రాస్తారోకోలో సీమాంధ్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వరంగల్‌లోని పోచమ్మ మైదానం ప్రాంతంలోనూ తెరాస నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన సీమాంధ్ర నేతలను మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.