వైయస్ జగన్ విధేయులపై కన్నేసిన కాంగ్రెసు హైకమాండ్

Sonia Gandhi
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విధేయులపై కాంగ్రెసు అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. జగన్ విధేయులపై ఆరా తీస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఈ విషయంలో సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ వ్యతిరేకులెవరనేది కూడా అధిష్టానం ఆరా తీసింది. అదే సమయంలో ఇటు తమకు విధేయత ప్రదర్శిస్తూనే వైయస్ జగన్ తో కూడా సంబంధాలు నెరపుతున్నవారి గురించి కూడా ఆరా తీస్తోంది. జగన్ కు విధేయంగానో, వ్యతిరేకంగానో ఉన్నవారి విషయంలో అధిష్టానానికి ఇప్పిటకే స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, అటూ ఇటూ ఉండేవారిపైనే ప్రధానంగా అధిష్టానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీ గురించి, పార్టీ అధిష్టానం గురించి కూడా తెలియనివారికి ఎన్నికల్లో టికెట్లు ఇప్పించి గెలిపించుకున్నారు. ఇటువంటి వారే జగన్ కు వూర్తిగా విధేయత ప్రకటిస్తున్నారు. తమకు అధిష్టానం అంటే ఏమిటో తెలియదని కూడా చెబుతున్నారు. ఇటువంటి జాబితాను పార్టీ అధిష్టానం తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. తమ మాటకు కట్టుబడి ఉండే వారికి బాధ్యతలు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెండు వైపులా ఉండేవారి గురించి సర్వేలు చేయించి సమాచారం తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రభావం పిసిసి అధ్యక్ష ఎన్నిక, పార్టీ కార్యవర్గ నియామకం దగ్గరి నుంచి మంత్రివర్గ విస్తరణ వరకు ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+