రేపే వైయస్ జగన్ కు డెడ్ లైన్: వినకుంటే షోకాజ్ జారీ

వైయస్ జగన్ కు నచ్చజెప్పేందుకు చివరి ప్రయత్నంగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ దూతగా వ్యవహరించే అవకాశం ఉన్నాయి. మొయిలీ మాట కూడా జగన్ వినకుంటే చర్యలు తీసుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధపడినట్లు చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎన్నిక కూడా గురువారమే జరుగుతోంది. ఆ ఎన్నిక పూర్తి కాగానే రాష్ట్రంలో పెను మార్పులకు సోనియా గాంధీ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గంలో మార్పులతో పాటు పార్టీలో కూడా మార్పులకు ఆమె కసరత్తు చేస్తారు. ఈలోగానే వైయస్ జగన్ వ్యవహారాన్ని తేల్చే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications