ఏ విధమైన త్యాగాలకైనా సిద్ధమంటున్న వైయస్ జగన్ క్యాంప్

వైయస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందువల్ల వైయస్ కుటుంబం కోసం తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఉన్నానని ఆయన అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. తాను జగన్ వెంటే ఉంటానని ఆయన చెప్పారు. జగన్ వెంట ఉండడం వల్ల ఎదురయ్యే చర్యలకు తాను సిద్ధపడి ఉన్నానని ఆయన అన్నారు. అధిష్టానం రాయబారిగానే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇడుపులపాయకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications