వైయస్ జగన్ ఓదార్పుపై ఆ ముగ్గురి మాట వింటారా?

కాగా, అధిష్టానం రాయబారిగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ గురువారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్ విగ్రహానికి పూలమాల వేసి మొయిలీ నివాళులు అర్పించారు. వీరప్ప మొయిలీతో వైయస్ జగన్ కరచాలనం చేశారు. మొయిలీతో పాటు వైయస్ ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు, వైయస్ శిష్యుడు, మంత్రి రఘువీరా రెడ్డి కూడా ఉన్నారు. కెవిపి జగన్ ఉన్నతిని కోరేవారనే విషయం అందరికీ తెలిసిందే. రఘువీరా రెడ్డి కూడా జగన్ మంచినే కోరుకుంటారు. జగన్ కు మొయిలీ మద్దతు ఉందనే ప్రచారం కూడా ఉంది. జగన్ కు అత్యంత సన్నిహితులు, వైయస్ కుటుంబం మంచి కోరే వారు అయిన ఆ ముగ్గురు వైయస్ జగన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారని ఆంటున్నారు.
శుక్రవారంనాడు వైయస్ జగన్ తో మొయిలీ, కెవిపి రామచంద్ రావు, రఘువీరా రెడ్డి చర్చలు జరుపుతారని అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా మాట మేరకు ఓదార్పు యాత్రను ఆపాలని వారు జగన్ కు సూచించే అవకాశం ఉంది. సోనియా మాట వినిడం వల్ల భవిష్యత్తు ఉంటుందని, సోనియా ఆగ్రహానికి గురై పార్టీ నుంచి వెళ్లిపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని కూడా వారు చెప్పవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications