వైయస్ జగన్ నోట తొలిసారి సోనియా గాంధీ మాట

YS Jagan
కడప: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నోట తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా మాట వినిపించింది. ఆయన సోనియాను పొగడలేదు. విమర్శించనూ లేదు. అధికారిక కార్యక్రమంలో, ఎంపీ హోదాలో చేసిన ప్రసంగంలో సందర్భానుసారం సోనియా ప్రస్తావన తీసుకొచ్చారు. తన తండ్రి ఒత్తిడి వల్లే కడప-బెంగళూరు రైలు మార్గంపై సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు లో కదలిక వచ్చిందన్నారు. కడప-బెంగుళూరు రైలు మార్గానికి రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప బుధవారం కడప రైల్వే స్టేషన్‌లో శంకుస్థాపన చేశారు. తన తండ్రి వైఎస్ సీఎంగా ఈ రైలు మార్గం కోసం ఎంతో కృషి చేశారని జగన్ తెలిపారు.

రాష్ట్రవాటాగా 50% నిధులిచ్చేందుకు ముందుకు రావడంతోపాటు, ఒత్తిడి తేవడంతో సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారులో కదలిక వచ్చిందన్నారు. ఆ తర్వాత జగన్ కడపలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన వైఎస్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తాను గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పారు. "ఇంతవరకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంత కాలం ఎన్ని జరుగుతున్నా ప్రజల ఆదరాభిమానాలతోనే చిరునవ్వుతో తిరగలుగుతున్నాను. ప్రజల ముందుకు రాగలుగుతున్నాను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను'' అని రెండు చేతులెత్తి నమస్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+