వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని శివప్ప అంటున్నారు. వైయస్ పై గౌరవంతో ఆ పార్టీ పేరు అలా పెట్టినట్లు ఆయన తెలిపారు. శివప్ప వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సలహా మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. వైయస్ జగన్ కోసమే ఆ పార్టీని రిజిష్టర్ చేయించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. అధిష్టానం జగన్ పై చర్య తీసుకుంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తింపు సాధించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications