గ్రూప్ వన్ కు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. పలు చోట్ల ఆందోళనలకు దిగారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మూడు వలయాల భద్రతా ఏర్పాట్లు చేసి విద్యార్థులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్షా కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది.
తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ముఖ్యమంత్రి కె. రోశయ్య పరీక్ష నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరీక్ష వాయిదాకు గవర్నర్ నరసింహన్ కూడా సానుకూలంగా లేరు. అప్పటికే పరీక్ష నిర్వహించడానికి ఎపిపిఎస్సీ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications