బయటికొచ్చిన గ్రూప్ వన్ పరీక్ష: ఉస్మానియాలో తీవ్ర ఉద్రిక్తత

ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాదు పిజి కశాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాదులోని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల హాజరు చాలా తక్కువగా ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం బిఇడి కాలేజీ సెంటర్ కేంద్రం వద్దకు వచ్చిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలతో విద్యార్థులు ఉస్మానియాలోని ఆర్ట్ర్స్ కళాశాల వద్ద ప్రదర్సిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కూడా పలువురు అభ్యర్థులు పరీక్షను బహిష్కరించారు. తెలంగాణవ్యాప్తంగా అభ్యర్థులు చాలా మంది పరీక్షలను బహిష్కరించారు.












Click it and Unblock the Notifications