ముఖం చూసి బొట్టు పెడుతున్నారు: జెఎసి నేత కోదండరామ్

తమ ప్రాంత విద్యార్థుల డిమాండ్లపై చర్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా లేదని, ఇది ప్రజాస్వామిక పద్దతి కాదని ఆయన అన్నారు. అది ప్రజాస్వామిక ప్రభుత్వం చేయాల్సిన పని కాదని ఆయన అన్నారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులకు, మంత్రులకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అడిగితే ఇలా వ్యవహరించి ఉండేవారు కారని ఆయన అన్నారు. వివక్షాపూరితమైన పద్ధతి కొనసాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని కోరుతున్నారని, దానిపై కనీసం చర్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications