ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యుద్ధ వాతావరణం

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణను అడ్డుకోవడానికి విద్యార్థులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒయులోని బిఇడి కళాశాల సెంటర్ లోకి విద్యార్థులు బారికేడ్లను ఛేదించుకుని, గోడలు దూకి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ప్రశ్నపత్రాలను బయటకు తెచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.

పోలీసులపైకి విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసారు. ఉస్మానియాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అయితే పరీక్ష సజావుగా జరుగుతోందని డిసిపి లడ్హా చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో 35 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అందులోనూ చాలా మంది పరీక్షను బహిష్కరించారు కూడా. హైదరాబాదులో 45 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. సీమాంధ్రలో 65 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉస్మానియాకు సమీపంలోని శివం రోడ్డులో ఆందోళనకారులు బస్సుకు నిప్పు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+