నిర్మాత రామానాయుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

రాముడు - భీముడు చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా సినీ రంగంలో కాలు పెట్టారు. ఆయన బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించే చిత్రంలో నటించడాన్ని నటీనటులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. పలువురు హీరోలను, హీరోయిన్లను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత కూడా రామానాయుడికి దక్కుతుంది. ఇప్పటికీ ఆయన నిర్మాణ రంగంలో చురుగ్గా ఉన్నారు. ఆయన కుమారుల్లో సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మరో కుమారుడు వెంకటేష్ సినీ హీరోగా స్థిరపడ్డారు. రామానాయుడికి ఈ అవార్డు రావడం పట్ల తెలుగు చలన చిత్ర రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications