హైదరాబాద్: ఎరువులు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన ఎరువుల సమస్యపై మీడియాతో మాట్లాడారు. రేపు మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లి ఎరువుల సమస్యపై రైతులను కలుస్తానని తెలిపారు. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కుతున్నా ముఖ్యమంత్రి రోశయ్య పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓవైపు రైతులు ఎరువుల కోసం ఆందోళనలు చేస్తుంటే...మరోవైపు రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.