వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కొనసాగింపు ఏడాదిన్నర

తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును, రాజకీయ ఎజెండాను దృష్టిలో పెట్టుకునే జగన్ సుదీర్ఘ కాలం ఓదార్పు యాత్రే చేసేలా ప్రణాళిక రచించుకున్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్ర ద్వారా మాత్రమే ప్రజల్లోకి వెళ్లే వీలుంటుందని, తద్వారా కాంగ్రెసును బలహీన పరచవచ్చునని లేదా లొంగదీసుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా యాత్రనే తీసుకుంటే శుక్రవారం మొత్తం 22 గ్రామాలను చుట్టారు. అందులో 13 చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. అయితే అసలు కార్యక్రమం అయిన బాధితులను ఓదార్చింది కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే. గురువారం 16 గ్రామాల్లో పర్యటించినా ఒక్క చోటా ఓదార్పు లేదు. ఈ జిల్లా యాత్ర సెప్టెంబరు మూడో తేదీన మొదలయింది. ముందుగా 15 రోజుల పాటు యాత్ర ఉంటుందని ప్రకటించారు. యాత్రను పొడిగిస్తున్న తీరు చూస్తే ఈనెలాఖరు వరకు కూడా ఈ జిల్లాలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 12 శాసనసభ నియోజకవర్గాలుండగా పది రోజుల్లో నాలుగు నియోజకవర్గాల్లోనే యాత్ర పూర్తయింది.
ఈ రకంగా ప్రతి జిల్లాలోనూ ఓదార్పు యాత్రను రోజుల తరబడి పొడగించడం, వైయస్ విగ్రహాలను ఆవిష్కరించాలని ప్రజలు కోరుతున్నారని చెబుతూ బాధితులు లేని గ్రామాలను కూడా చుట్టిరావడం ఒక వ్యూహంగానే కొనసాగుతోందని విశ్లేషిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ క్యాడర్ ను, నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications