వైయస్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి అక్రమ ఎరువుల పట్టివేత

Ravindranath Reddy
కడప: దివంగత నేత వైయస్సార్ బావమరిది, కడప మేయరు రవీంద్రనాథ్‌ రెడ్డితో పాటు మరో నలుగురికి చెందిన బాలాజీ మిశ్రమ ఎరువుల కర్మాగారంలో తయారై నిబంధనలకు విరుద్ధంగా తరలుతున్న 102 టన్నుల ఎరువులు పట్టుబడ్డాయి. మంగళవారం కడప శివారులో ఆరు లారీలు అనుమానాస్పందంగా నిలిపి ఉంచిన విషయం మీడియా ద్వారా బయటకు పొక్కింది. అధికారులు తనిఖీలు చేయగా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. డెలివరీ చలానాల్లో నమోదు చేసిన ఎరువుల రకాలకు, లారీల్లో ఉన్న వాటికి తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు రవాణాకు సంబంధించిన వే బిల్లులు కూడా లేవని తేలింది. అయితే, ఇదంతా ఓ గుమాస్తా తప్పుగా రాయడం వల్ల జరిగిందే తప్ప అక్రమాలేవీ జరగలేదంటూ కడప మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు.

మిశ్రమ ఎరువులు తయారీకి ప్రధానంగా యూరియా, డీఏపీ అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో వీటికి తీవ్ర కొరత ఉంది. మంగళవారం పట్టుబడ్డవి యూరియా, డీఏపీలతో తయారు చేసినవే కావడం గమనార్హం. బాలాజీ మిశ్రమ ఎరువుల కర్మాగారంలో తయారైన ఎరువులను నగర శివారులో పట్టుకున్నామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు చిన్న నారాయణ చెప్పారు. ఎరువుల విలువ రూ.8,21,100 ఉంటుందని, వే బిల్లులు లేకుండా, డెలవరీ చలానాల్లో పేర్కొన్న ఎరువుకు పొంతన లేకుండా ఉన్నట్లు తేలిందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాకు 4, కర్నూలు జిల్లాకు 2 లారీలు తరలిస్తున్నట్లు గుర్తించామని, ఇవి పోలీసుల అధీనంలో ఉన్నాయని, వీటిని వ్యవసాయశాఖకు స్వాధీనం చేయగానే కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+