హైకోర్టు వద్ద ఉద్రిక్తత: పెట్రోలు పోసుకొని న్యాయవాది ఆత్మహత్యాయత్నం

కాగా న్యాయవాదులు ప్రధాన గేటుకు పోలీసులు వేసిన తాళాన్ని పగులగొట్టే ప్రయత్నాలు చేశారు. కొందరు గేటు దూకి లోనికి వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. కోర్టు లోపల నిరాహార దీక్ష చేస్తున్న ముగ్గురు న్యాయవాదుల పరిస్థితి ఆందోళనగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కొందరు ఏకంగా బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. కోర్టు ముందు గంపా వెంకటేష్ గుప్తా అనే న్యాయవాది పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఐతే దానిని న్యాయవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాదుల ఆందోళనకు తెలంగాణ వైద్యులు మద్దతు తెలిపారు. డిమాండ్ ను పరిష్కరించకపోతే తాము కూడా ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.
కాగా, న్యాయవాదుల ఆందోళనపై ప్రభుత్వం దిగి రావడం లేదు. తాము చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని మంత్రులంటున్నారు. తెలంగాణ న్యాయవాదుల వద్దకు ఆరుగురు అధికారులను పంపేందుకు సిద్ధపడ్డారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోవడంపై తెలంగాణ న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గీతారెడ్డిపై వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications