న్యాయవాదుల ఆందోళనపై తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల మధ్య తేడాలు

తెలంగాణ న్యాయవాదుల డిమాండ్ సరైందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారికి తన సంఘీభావం తెలుపుతున్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 60 ఏళ్లలో ఒక్కసారి కూడా అడ్వొకేట్ జనరల్ పదవి తెలంగాణవారికి రాలేదనే బాధ అందరిలోనూ ఉందని ఆయన అన్నారు. తెలంగాణవారికి 42 శాతం వాటా కేటాయించాలనే డిమాండ్ న్యాయమైందేనని ఆయన అన్నారు. న్యాయసంబంధమైన పదవుల్లో తెలంగాణవారికి 40 నుంచి 45 శాతం కేటాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications