నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండున్నర సంవత్సరాల చిన్నారిని సజీవ దహనం చేసిన హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ మండలంలోని ఇసుకపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య తగాదా రావటంతో వారు ఆ కోపంలో పక్కనే ఉన్న తమ రెండున్నర సంవత్సరాన చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని సజీవ దహనం చేసిన దంపతులను శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.