హైదరాబాదులో బంగారం దుకాణం దగ్ధం: రూ.3 లక్షలు నష్టం
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని నగరంలోని కూకట్ పల్లిలో ఇంకా ప్రారంభం కాని ఓ నగల దుకాణం మంటల్లో కాలిపోయింది. నిజాంపేటలోని నెస్ట్ హాస్పిటల్ కాంప్లెక్సు గ్రౌండ్ ఫ్లోర్ లో త్వరలో ఓ నగల దుకాణం ప్రారంభం కానుంది. అందుకోసం పనులు ప్రారంభించారు. ఐతే శుక్రవారం ఉదయం సమయంలో ఆ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఒక్కసారిగా అవి ఎక్కువై దుకాణం పూర్తిగా దగ్ధమయింది. స్థానికులు ఫోన్ చేయటంతో ఫైర్ ఇంజన్ లు వచ్చి మంటలను ఆదుపులోకి తీసుకు వచ్చాయి. కాగా మంటలు రేగటానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.