తెలంగాణ ఇస్తామని కెసిఆర్ కు ఎవరు చెప్పారు: ఎమ్మెల్సీ ఆమోస్
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలంగాణ ఇస్తామని కెసిఆర్ కు ఎవరు చెప్పారో తమకు తెలియదని, కాంగ్రెసు అధిష్టాలం మాత్రం ఏ విషయాన్ని ఆయినా ముందుగా మాకే చెబుతుందని కాంగ్రెసు ఎమ్మెల్యే ఆమోస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. కెసిఆర్ ఇప్పటికీ చాలాసార్లు అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అన్నారని, ఎవరు చెప్పారంటే కాంగ్రెసు ఆధినేత్రి పేరు చెప్పేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా కెసిఆర్ కాంగ్రెసు పైన నెపం వేయడానికి చూన్తున్నారని కాని తెలంగాణపై సోనియా మాకు చెప్పకుండా బయటి వారికి ఎలా చెబుతుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ తర్వాత కాంగ్రెసు అధిష్టానం ప్రక్రియ ప్రారంభిస్తుందన్నారు. మొదట శ్రీకృష్ణ కమిటీ ఫలితం తేలాలని ఆయన అన్నారు.