వైయస్ జగన్ కు నేదురుమల్లి మనుషులే సహకరిస్తున్నారా?

జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గోపాల్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోదని, వారిని పార్టీ నుంచి తొలగించాలని ఆయన అన్నారు. వారు పార్టీకి చేసిందేమీ లేదని ఆయన అన్నారు. కాగా, ఈ ఇద్దరు నాయకులపై ఇప్పటికే పార్టీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ భూస్థాపితమవుతుందనే శాసనసభ్యురాలు కొండా సురేఖ మాటలను ఆనం వివేకానంద రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెసు ఎప్పటికీ భూస్థాపితం కాదని ఆయన అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించడాన్ని ఆయన సమర్థించారు.












Click it and Unblock the Notifications