వెనక్కి తగ్గని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి: వైయస్ జగన్ వెంటే

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న వారిపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణ పేరుతో వేటు వెయ్యడం సమంజసం కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. ఇలా వేటు వేయడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు.
జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ కే లాభమనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం గ్రహించాలన్నారు. పార్టీ అధిష్టానంతో త్వరలో ఈ విషయమై తాను మాట్లాడుతానని ఆయన తెలిపారు. జగన్ యాత్ర ఈ నెల 11 వరకు ప్రకాశం జిల్లాలో ఉంటుందని ఆ తరువాత నుండి నెల్లూరులో ప్రారంభమవుతుందని ఆయన పర్యటన గురించి వివరించారు.












Click it and Unblock the Notifications