కర్ణాటక బిజెపి సంక్షోభం: రంగంలోకి దిగిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu
బెంగళూరు: కర్ణాటక బిజెపి ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. తిరుగుబాటు శాసనసభ్యులను బుజ్జగించి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. ఆయన బుధవారం రాత్రి బెంగళూర్ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సూచన మేరకు తాను బెంగళూర్ వెళ్తున్నట్లు అంతకు ముందు వెంకయ్యనాయుడు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెసు కారణమని ఆయన విమర్శించారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్న మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఆశ్రయించారు. గాలి జనార్దన్ రెడ్డి చెన్నైలో ఉన్న 19 మంది శానసనసభ్యులతో బుధవారం రాత్రి చర్చలు జరిపారు. అయితే వారు మెట్టు దిగడం లేదు.

యెడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు 19 మంది శాసనసభ్యులు గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజకు లేఖ ఇచ్చారు. వీరిలో 14 మంది బిజెపి సభ్యులు. వారి మద్దతు ఉపసంహరణతో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల సంఖ్య 105కు పడిపోతుంది. దాంతో యెడ్యూరప్ప ప్రభుత్వం గట్టెక్కలేదు. అయితే, తాను ఈ నెల 11వ తేదీననే శాసనసభలో బలాన్ని నిరూపించుకుంటానని యెడ్యూరప్ప చెప్పారు. బలనిరూపణ కోసం ఆయనకు గవర్నర్ 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మరో ఇద్దరు మంత్రులకు కూడా ఉద్వాసన పలికేందుకు యెడ్యూరప్ప సిద్ధపడ్డారు. తిరుగుబాటు శాసనసభ్యులకు యెడ్యూరప్ప మంత్రి పదవులు ఎర చూపుతున్నారు.

ఇదిలా వుంటే, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెసు, జెడి(ఎస్) నాయకత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. శాసనసభ్యులతో ఆ రెండు పార్టీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో మూడు ముక్కలాట సాగుతోంది. తిరుగుబాటు శాసనసభ్యులు ఏ పార్టీకి మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+