వ్యూహం మార్చుకున్న చంద్రబాబు: పార్టీ నేతలపైనే నిందలు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహం మార్చుకున్నట్లే కనిపిస్తున్నారు. కాస్తా ఉత్సాహాన్ని కూడా పెంచుకున్నట్లున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ వచ్చిన ఆయనకు ఆసరా దొరికినట్లయింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును దెబ్బ తీయడానికి గద్దర్ తెలంగాణ ప్రజాఫ్రంట్ తో ముందుకు రావడంతో ఆయనలో ఉత్సాహం పెరిగినట్లుంది. కెసిఆర్ వల్ల తన పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకు పోతుందని భావించిన ఆయనకు గద్దర్ వల్ల భరోసా దొరికినట్లయింది. దీంతో ఆయన పార్టీ నాయకులకు ఉత్సాహం నూరి పోస్తున్నారు. అంతేకాదు, వారితో ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా మాట్లాడుతున్నారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో అది స్పష్టంగా కనిపించింది.

కాగా, పార్టీ నాయకులపై ఆజమాయిషీని పెంచారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాయకులే కారణమని ఆయన నిందించారు. పొలిట్ బ్యూరోలో, రాష్ట్ర కమిటీలో పదవుల కోసం తన చుట్టూ తిరిగిన నేతలు ఆ పదవులు దక్కిన తర్వాత పని చేయడం మానేస్తున్నారని ఆయన తిట్టిపోశారు. అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొత్త నాయకత్వాన్ని ముందుకు తెస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబులో అకస్మాత్తు మార్పునకు పార్టీ నాయుకులే నివ్వెరపోతున్నారు.

మరో విషయం కూడా పార్టీ నాయకులకు అశ్చర్యం కలిగించింది. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణకు మద్దతిస్తామని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇంత అకస్మాత్తుగా ఆయన ఈ వైఖరిని ప్రకటించడానికి గద్దర్ ప్రజా ఫ్రంటే కారణమని అంటున్నారు. గద్దర్ రాకతో తెలంగాణ ప్రజలు కెసిఆర్ వైపు ఉండాలా, గద్దర్ వైపు ఉండాలా అయోమయంలో పడిపోయారని, ఈ సమయంలో ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి తెలంగాణ అనుకూల ప్రకటన పనికి వస్తుందని ఆయన భావించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+