కేరళలో తన బ్యాగులోని డబ్బులు పోగొట్టుకున్న సినీ నటి రోజా
State
oi-Pratapreddy
By Pratap
కోయంబత్తూరు: నటి రోజా బ్యాగులోని నగదు అదృశ్యమైన ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. కేరళలోని ఒట్రపాలయం వెళ్లేందుకు మంగళవారం రాత్రి ఏడు గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి ఆమె కోయంబత్తూరు బయలుదేరారు. రాత్రి 8.30 గంటలకు విమానం దిగిన తర్వాత బ్యాగు చూసుకోగా అందులోని రూ.2.60 లక్షలు కనిపించలేదు. విషయాన్ని విమానాశ్రయ భద్రత అధికారులకు తెలిపారు.
అక్కడి అధికారుల సూచనల మేరకు జెట్ ఎయిర్ వేస్ మేనేజరుకు ఫిర్యాదు అందించి ఒట్రపాలయానికి కారులో వెళ్లిపోయారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.