జగన్ ను అదుపు చేయలేక చంద్రబాబుపై విమర్శలు: సోమిరెడ్డి

Telugudesam
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను అదుపు చేయలేక రాష్ట్ర మంత్రులు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేసిన రాష్ట్ర మంత్రులపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ వేసే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కడ లేని అవినీతి చోటు చేసుకుందని ఆయన విమర్సించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉపాధి హామీ పథకం అమలును పట్టించుకుంటున్న కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లోని అవినీతిని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నైతికంగా ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం, లోక్ సత్తాల వల్ల ఎన్నికల్లో కాంగ్రెసు గట్టెక్కిందని, సొంత బలం వల్ల అది గెలవలేదని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే కాంగ్రెసు చిత్తుగా ఓడిపోతుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని తెలుగుదేశం మరో నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. మంత్రులు మందలాగా వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. మంత్రులు పనిచేయడం లేదని, తమ కుటుంబ సభ్యులే అసహ్యించుకునేంత నీచంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి ఏడాది కూడా గడవక ముందే మంత్రులు మారిపోయారని, శవంపై పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+