గద్దర్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెసు ఎంపి మందా జగన్నాథం

కళ్లుండీ గద్దర్ తాము తెలంగాణ కోసం ఏం చేశామో చూడలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై గద్దర్ చిత్తశుద్ధి మీద తమకు సందేహాలు లేవని, అయితే తెలంగాణ కోసం కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఏమీ చేయలేదని గద్దర్ అనడం తప్పు అని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభను మహబూబ్ నగర్ లో నిర్వహించాలని కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు కరీంనగర్ లోనూ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోనూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications