వేడుకలలో పాల్గొంటామన్న కోమటిరెడ్డిపై కెటిఆర్ పైర్

మంత్రులు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం అధికారికంగా తెలంగాణలో అవతరణ దినోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను అధికారికంగా చేయని ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఢిల్లీ యాత్రను ఆ పార్టీ ఆధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆమోదిస్తున్నాడా అనే విషయాన్ని ప్రకటించాలని కోరారు. అప్పుడే మేం తెలుగు దేశాన్ని నమ్మేది నమ్మొద్దా అని నిర్ణయించుకునే అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications