పవన్ కళ్యాణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన వనపర్తి కోర్టు

2008లో పవన్ కళ్యాణ్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్ నాయకులను గుడ్డలూడదీసి కొట్టాలి అని అభ్యంతర వాఖ్యలు చేశాడు. దీంతో పవన్ ప్రచారంలో ఆభ్యంతరకర వాఖ్యల చేశారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే ఇప్పటికి మూడు సార్లు కోర్టు కేసు విచారణ జరిగినా పవన్ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. పవన్ ఎంతకీ స్పందించక పోవటంతో కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. కాగా కోర్టునుండి ఆదేశాలు రాగానే పోలీసులు పవన్ కళ్యాణ్ అరెస్టుకు చేయడానికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. కోర్టు ఇవ్వాలే పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తే మంగళవారం ఉదయం వనపర్తి పోలీసులు హైదరాబాద్ చేరుకుంటారు.












Click it and Unblock the Notifications