కాంగ్రెసుతో కెసిఆర్ మిలాఖత్: చంద్రబాబుపై నిప్పులు

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మళ్లీ కాంగ్రెసుకు దగ్గరవుతున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావుతో ఆయన గురువారం సాయంత్రం మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఆయన నివాసంలోనే మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెసుకు మద్దతుగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, డిసెంబర్ 9వ తేదీ ప్రకటన ద్వారానే కాంగ్రెసు తెలంగాణను ఇచ్చేసిందని, దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు తన మాటను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత జనవరి చివరి వరకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని, అప్పటికి తెలంగాణపై కేంద్రం తన మాటను నిలబెట్టుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణవాదులమంతా ఏకమవుతామని కాంగ్రెసు నాయకుడు కేశవ రావు అన్నారు.

చంద్రబాబు తెలంగాణపై మాట నిలబెట్టుకోకపోవడం వల్ల సీమాంధ్రలో కూడా విశ్వసనీయత కోల్పోతారని, ఆ పార్టీ నిట్టనిలువునా చీలిందని, ఇటు తెలంగాణలోనూ అటు కోస్తాలోనూ ఆ పార్టీ ఎటూ కాకుండా పోతుందని, చంద్రబాబును చూస్తే జాలేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబుకు నైతికత లేదని, మాటిమాటికి మాట మారుస్తారని ప్రజల్లోకి వెళ్లిందని ఆయన అన్నారు. తెలుగుదేశం మద్దతు అవసరం లేకుండానే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు వెళుతుందని, ఆ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కోల్పోయిందని, అది నిలువునా చీలిపోయిందని చెప్పారు.

తెలంగాణ ఇవ్వబోమని తమ పార్టీ ఎక్కడా చెప్పలేదని కేశవరావు అన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తమ పార్టీ వివిధ రూపాల్లో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోందని అంటూ కాంగ్రెసు తెలంగాణకు కట్టుబడుతూ చేసిన ఆ ప్రకటనలను పరిశీలించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+