వైయస్ జగన్ క్యాంప్ మంత్రులు ఔట్: చిరంజీవితో కుదిరిన డీల్

జానారెడ్డి, బసవరాజు సారయ్య, రాంభూపాల్ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నరసింహం, టి బాలరాజులకు మంత్రివర్గంలోకి రావచ్చునని అంటున్నారు. మంత్రివర్గాన్ని రోశయ్య పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇచ్చి, మరికొంత మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చిరంజీవి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో రహస్యగా సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రహస్య సమావేశంలో డీల్ కుదిరినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications