కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై జగన్ వర్గం గోనే ప్రకాశరావు ఫైర్

వారి చర్యల కారణంగా పార్టీ రాష్ట్రంలో పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీని మాత్రమే కాకుండా మీడియాను కూడా రెండు వర్గాలు వారు విభజించారన్నారు. పాలితులను విభజించారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాకుంటే జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. జైపాల్ రెడ్డి పెద్ద భజనపరుడన్నారు. తెలంగాణకు జైపాల్ రెడ్డి సరియైన పరిష్కారం చూపించాలని సవాల్ చేశారు. జైపాల్ రెడ్డి తన నియోజవర్గాలనే అభివృద్ధి చేసుకోలేక పోయారని దుయ్యబట్టారు.
ఆయనకు అంత ప్రజాధరణ ఉంటే నియోజకవర్గాలు ఎందుకు మారారని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ నుండి మిర్యాలగూడ, ఆక్కడినుండి తాజాగా చేవెళ్ల మారారని విమర్శించరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగానీ, వైఎస్ జగన్ గానీ ప్రజలకొరకే ఉన్నారని వారు ప్రజలనే నమ్ముకున్నారన్నారు. వైఎస్ తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు జగనే అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసి జైపాల్ రెడ్డి ఢిల్లీలో భజన చేసుకుంటూ కూర్చున్నారన్నారు.












Click it and Unblock the Notifications