వైయస్ జగన్ కు కలిసొచ్చిన చిన్నాన్న వైయస్ వివేకానంద ఎపిసోడ్

జగన్ మానసికంగా ఎప్పుడో పార్టీ పెట్టడానికి సిద్ధమయినప్పటికీ ఆ అవకాశం తన చిన్నాన్న ద్వారా ఇన్నాళ్లకు వచ్చింది. రోశయ్యను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చుండ బెట్టడంతో రోశయ్యపై జగన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. అయితే దానిని అధిష్టానం లెక్కలోకి తీసుకోక పోవటంతో ఏకంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీపైనే విమర్శలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం దానినే సీరియస్ గా తీసుకుంది. అయితే జగన్ వర్గం ప్రజల సానుభూతి కోసం పార్టీ వేరు, మీడియా వేరని, జగన్ కు ఆ వార్తకు సంబంధం లేదని ప్రకటించి, అధిష్టానం జగన్ పై ఏమైనా చర్యలు తీసుకుంటే సానుభూతి పొందడానికి ప్రయత్నాలు చేసింది. అయితే అధిష్టానం ఆయనపై చర్యలకు ముందుకు రాలేదు.
పార్టీ గెంటివేస్తే బయటకు వెళ్లి ప్రజల సానుభూతి పొందుదామనుకున్న జగన్ కు అధిష్టానం షాక్ నిస్తూ వస్తూంది. ఈ నేపథ్యంలో వివేకాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడం జగన్ వర్గానికి అనుకోని విధంగా కలిసి వచ్చింది. వెంటనే జగన్ తో పాటు జగన్ వర్గం వారు కాంగ్రెసు తనను అణగద్రొక్కడానికి కుటుంబాన్ని చీల్చే కుట్ర చేస్తుందంటూ ప్రజల ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ఏకంగా తన చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి తనకు దూరం చేయాలని చూస్తుందని లేఖలోనే పేర్కొన్నారు. అంతకుమించి జగన్ ఏమి మాట్లాడలేదు. కాని జగన్ గొంతుక అయిన అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు వివేకాకు మంత్రి పదవి ఇవ్వజూపడాన్ని కారణంగా చూపి పెద్ద ఇష్యూగా చేసి కొత్త పార్టీ పెట్టే దిశలో పావులు కదుపుతున్నారు. బ్రిటిష్ వారు దేశాన్ని విభజించి పాలింటినట్లుగానే కాంగ్రెసు అధిష్టానం జగన్ కుటుంబాన్ని చీల్చి ఆయనను దెబ్బతీయాలని చూస్తుందని చెవిరెడ్డి బాస్కరరెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications